Kajal: బాలీవుడ్ లో నైతిక విలువలు లోపించాయి

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితోను వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన అందంతో, నటనతో గూడు కట్టుకున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది. ఇక కరోనా సమయంలో సడన్ గా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని 2021 అక్టోబర్ 31వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గతేడాది ఏప్రిల్ 19వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా, ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వాక్యాలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ దక్షిణాది సినిమాలు వర్సెస్ బాలీవుడ్ అనే టాపిక్ పై స్పందించి, బాలీవుడ్ లో నైతికత లోపించింది. దక్షిణాదిలో ఉన్న విలువలు బాలీవుడ్ లో లేవని తెలిపింది. టాలెంట్ ఉంటే దక్షిణాది ప్రేక్షకులకు తప్పకుండా అంగీకరిస్తారని కాజల్ వెల్లడించింది.

- Advertisement -

తను పుట్టి పెరిగింది. ముంబై నగరమే అయినా తన కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్ లోనేనని చెప్పింది. దక్షిణాది ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అక్కడ అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్లు ఉన్నారని తెలిపింది. దక్షిణాది నుంచి మంచి కంటెంట్ వస్తుందని కొనియాడింది. బాలీవుడ్ లోనూ తను మంచి సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతిక విలువలు ఇక్కడ లోపించాయని భావిస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు