Dasara : నాని30 సినిమాకి అంత బిజినెసా ?

నాచురల్ స్టార్ట్ నాని మినిమమ్ గ్యారంటీ హీరో రేంజ్ నుంచి స్టార్ట్ హీరో రేంజ్ కి ఎదుగుతున్నాడు. సినిమా, సినిమాకి నాని తనకి తాను కొత్త గా ఆవిష్కరించుకుంటూ ఇప్పడూ ఉన్న యంగ్ హీరోలకి ఇన్స్పిరేషన్ గా తయారవుతున్నాడు. కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడం, కథల విషయం లో జాగ్రత్త ఉండటం, సినిమాని నమ్మి అన్ని చోట్ల ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులకి ఆయన సినిమా రీచ్ అయ్యేలా చేయడం ఇలా అన్ని విషయాల్లో నాని తన ఇన్వొల్వెమెంట్ ఉండేలా చూసుకుంటాడు. ఈ కారణం వల్లనే నాని సినిమాలు యావరేజ్ నుంచి హిట్ కి , హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కి నడుమ ఉంటున్నాయి.

కొత్త దర్శకుడిని నమ్మి ఆయన చేసిన లేటెస్ట్ సినిమా “దసరా” ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసాడు నాని. అయితే ఈ సినిమా తెలుగులో 100కోట్లు సాధించి నాని కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ దసరా సినిమాని చూసి నాని ని ప్రశంసించారు. తెలుగులో ప్రశంసలు, కలెక్షన్ లతో దూసుకుపోతున్న దసరా హిందీలో మాత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.

అయితే నాని ప్రస్తుతం మరో కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నారు. చాలా రోజుల కిందటే స్టార్ట్ అయినా ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ డేట్ కూడాఎనౌన్స్ చేశారు . అయితే ఈ సినిమాకి సంబంధించి ఆడియో రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కి ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడు పోయింది.

- Advertisement -

నాని30 లో సీతారామం ఫెమ్ మృణాల్ ఠాకూర్ నాని కి జోడిగా నటిస్తుంది.ఈ సినిమాలో నాని ఒక 6 ఏళ్ళ పాపకి తండ్రిగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆడియో రైట్స్ ని టి -సిరీస్ 7.1 కోట్లకి తీసుకుంది. ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్ ప్రైస్ . అంతేకాదు డిజిటల్ రైట్స్ అయితే ఏకంగా 36 కోట్లకి కొన్నారు. ఇంత ఫ్యాన్సీ రేట్ కి నాని సినిమా కొనడం ఇదే మొదటిసారి. పరిస్థితి చూస్తుంటే దసరా ఇంపాక్ట్ ఇండియా వైడ్ గట్టిగానే ఉన్నట్టు తెల్సుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు