Naga Chaitanya: కొత్తింట్లోకి నాగచైతన్య గృహప్రవేశం.. ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా మే 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నాగచైతన్య వరుసగా సినిమాల్లో నటిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే చైతన్య తన అభిరుచికి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని, అందులోకి ఇటీవలే గృహప్రవేశం చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఉగాది సందర్భంగా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు నాగచైతన్య. నాగార్జున ఇంటికి దగ్గరలోనే ఓ స్థలం కొన్న చైతన్య అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని డిజైన్ చేయించుకున్నారట.

స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని రెడీ చేసుకుని ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక చైతూ ఇంట్లోకి మొదట అతిధి మరెవరో కాదు ప్రేమమ్ సినిమాతో చైతూకు హిట్ ఇచ్చిన చందు మొండేటి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇంస్టా వేదికగా షేర్ చేసుకున్నారు. “ఉగాది రోజున యువ సామ్రాట్ కొత్త ఇల్లు. నేనే మొదటి అతిథి. కంగ్రాట్యులేషన్ అండ్ థాంక్యూ నాగచైతన్య” అంటూ చందు మొండేటి ఓ ఫోటోను పంచుకోగా ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు