Mega family : నిహారిక కొణిదెల విడాకులపై నాగ శౌర్య సంచలన వ్యాఖ్యలు

మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పెళ్లి అయ్యిన మూడేళ్లకె విడిపోవడమేంటని, ఇంత మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం అవసరమా..అంటూ ఎవరికీ తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ విడాకుల విషయంలో చైతన్య కంటే నిహారికదే తప్పు అంటూ ఆమెను నిందిస్తున్నారు.

నిహారిక విడాకుల విషయంలో మాట్లాడుకునే వాళ్లంతా లోలోపలనే మాట్లాడుకుంటుండగా బయటికి మాత్రం మెగా ఫ్యామిలీ పై అందరికి అభిమానం ఉండటం మూలాన ఎవరు దీన్ని ఇష్యూ చేయడం లేదు. అయితే విడాకులు అఫీషియల్ కన్ఫామ్ అయిన రోజు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి చేసిన మిమర్స్ కూడా ఇక ఈ విషయాన్నీ పట్టించుకోవడం మానేసారు.

అయితే యంగ్ హీరో నాగ శౌర్య మాత్రం నిహారిక కొణిదెల విడాకులపై గట్టిగ స్పందించాడు. విషయమేంటంటే.. ఇటీవలనే ఆయన హీరోగా నటించిన రంగబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కు అటెండ్ అయిన నాగ శౌర్య విడాకుల గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తనకు విడాకులపై అస్సలు నమ్మకం లేదని చెబుతూ ” ఇద్దరు వ్యక్తులు కలిసి లైఫ్ షేర్ చేసుకుంటున్నప్పుడు మనస్పర్థలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, మన పేరెంట్స్ తో కూడా మనకు గొడవలు అవుతుంటాయి అలాగని మనం ఆ రిలేషన్ ను వదులుకోము కదా కానీ ఒక్క లైఫ్ పార్ట్ నర్ విషయంలో మాత్రం మనం ఈజీగా డివోర్స్ అంటూ విడిపోతాం ఈ జెనెరేషన్ లో ఉన్న వాళ్ళు అందరు ఇలాగే చేస్తున్నారు ఇది తప్పు ” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే శౌర్య చెప్పింది, నిహారిక విడాకుల గురించి కాకపోయినప్పటికీ ఇటీవలనే ఆమె విడాకులు ట్రెండ్ అవడంతో నిహారిక గురించే చెప్పినట్టుగా బయటికి ప్రోజెక్టై అవుతూ నెట్ లో వైరల్ గా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు