Taraka Ratna: ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్..

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టిడిపి కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటిలేటర్ కింద ఉంచిన ఆయనను వైద్యులు అహర్నిశలు బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమైన విషయం అని చెప్పాలి.

అయితే నందమూరి తారకరత్న నటుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రికార్డులను నెలకొల్పాడని చెప్పొచ్చు. ఈ నందమూరి హీరో 20 ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. కమర్షియల్ గా ఈ సినిమా అంతగా ఆడకపోయిన, తారకరత్న నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తారక్, భద్రాద్రి రాముడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోగా కంటే తారకరత్నకు విలన్ గానే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే తారకరత్న పేరిట ఓ రేరెస్ట్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు, ఇకపై బ్రేక్ చేయలేరు కూడా. ఇంతకీ ఆ రికార్డు ఏంటా అనుకుంటున్నారా? అదేంటంటే తారకరత్న 2002లో ఒకేసారి 9 సినిమాలతో లాంచ్ అయ్యాడు. ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఇన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో అనే రేరెస్ట్ రికార్డు ఇంకా తారకరత్న ఖాతాలోనే ఉంది.

- Advertisement -

ముహూర్తం చేసుకున్న తొమ్మిది సినిమాల్లో ఐదు మాత్రమే విడుదలకు నోచుకున్నాయి. కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తారకరత్న, రవిబాబు ప్రోత్సాహంతో అమరావతి సినిమాతో విలన్ గా మారి కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ సినిమాలో తారకరత్న నటనకు విలన్ గా నంది అవార్డు వరించింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు