Nani30: విడుదలైన నాలుగు రోజులకే మరో మూవీ షూటింగ్.. గ్యాప్ ఇవ్వట్లేదుగా

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ మార్చి 30 న విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కలెక్షన్ల తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే 53 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా 100 కోట్ల దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమా విడుదలై వారం కూడా కాలేదు. అప్పుడే తన తదుపరి సినిమా షూటింగ్ లో నాని పాల్గొనబోతున్నాడు.

వివరాల్లోకి వెళితే నాని ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ జనవరి 31న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా గ్రాండ్ గా లాంచ్ అయింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి, కె. ఎస్ మూర్తి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు. సీతారామం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ 3 నుంచి గోవా లో చేస్తున్నారు. 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ ఉంటుంది. నాని ఈ సినిమాలో కియారా ఖన్నా అనే ఆరేళ్ళ పాపకి తండ్రిగా నటిస్తున్నాడు. జెర్సీ తర్వాత నాని మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు. తండ్రి కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా గా రాబోతున్న ఈ సినిమా 2023 ద్వితీయార్ధం లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు