Animal: సినిమాల్లోనే కాదు ఫోటోషూట్లతోను ఆకట్టుకుంటున్న నేషనల్ క్రష్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కడా తగ్గడం లేదు. పుష్ప ద్వారా నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ గా ఉంది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి తాను కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సుందరి గీతా గోవిందం తో మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరూ, పుష్ప సినిమాల్తో స్టార్ హీరోల సరసన నటించింది. ఇక హిందీలోనూ అడుగుపెట్టిన ఈ భామ గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలతో ఆకట్టుకుంది.

అయితే ఇటు వరుస సినిమాలు చేస్తూనే అటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ ఉంటుంది రష్మిక. మూవీ అప్ డేట్స్, యాడ్స్, ఫోటో షూట్స్ తో సహా అన్ని రకాల విషయాలను ఇంస్టాగ్రామ్ లో, ట్విట్టర్లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో 38మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని సౌత్ ఇండియాలో ఇంస్టాగ్రామ్లో మోస్ట్ ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఇక తాజాగా రష్మిక చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ కలర్ సూట్ లో లైట్ రూమ్ లో చేసిన ఆ ఫొటోషూట్ లో నేషనల్ క్రష్ మరింత ఆకర్షిస్తుంది. అయితే ఇలాంటి ఫోటో షూట్ లో రష్మికకు ఏం కొత్త కాదు. గతంలో ఒక జపనీస్ కంపెనీకి, అలాగే బజార్ ఇండియా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఇలాంటి ఫొటోషూట్లు చేసింది. ఇక ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తెలుగులో పుష్ప2 , రెయిన్ బో, వెంకీ కుడుములతో ఒక సినిమా చేస్తుండగా, హిందీలో అనిమల్ లోను హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు