Animal :ఇంతకుముందెన్నడూ ఇలాంటి వైలెన్స్ చూసుండరు.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి వంగ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్టర్ పీస్ 2017లో రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు, అండ్ సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్ ఐపోయాడు.

అయితే ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టరైంది . కబీర్ సింగ్ సినిమా తరువాత సందీప్ మళ్ళీ తెలుగులో సినిమా చేస్తాడని, అందరు అనుకున్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ యాక్టర్స్ కూడా సందీప్ తో వర్క్ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ అందరు ఆశ్చర్యపోయేలా సందీప్ రెడ్డి వంగ తన తరువాతి సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ బీర్ తో ఎనౌన్స్ చేసాడు. యానిమల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూర్తి దశకి చేరుకుంటుంది. రణ్ బీర్ కి జోడిగా ఈ సినిమాలో రష్మిక నటిస్తుంది.

అయితే యానిమల్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సినిమాకి పని చేసిన ఒక ఛీఫ్ టెక్నీషన్, ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వూ లో యానిమల్ సినిమాకి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. “సినిమాలో రణ్ బీర్ కపూర్ గ్యాంగ్ స్టర్ గా, మరియు సైకోపాత్ గా రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారంట. సినిమాలో విపరీతమైన వైలెన్స్ ఉండబోతుందని, ఇంతకు ముందెన్నడూ చూడాలి యాక్షన్ ఎపిసోడ్స్ ని జనాలు చూస్తారని, గతంలో రిలీజ్ చేసిన రణ్ బీర్ గొడ్డలి పట్టుకున్న పోస్టర్ ఫైట్, సినిమాకే హైలెట్ అవుతుందని, ఈ సీక్వెన్స్ రణ్ బీర్ కపూర్ కి చాలా ఇష్టమైందని ఆయన చెప్పినట్టు ” సమాచారం.

- Advertisement -

ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో మరియు అల్లు అర్జున్ లతో సినిమాలు చేయబోతున్నారు. ఈ ఇద్దరు హీరోలకి ఇప్పటికే కథ వినిపించిన సందీవ్ యానిమల్ సినిమా తరువాత ఈ రెండు సినిమాలలో ఏది ముందు మొదలవుతుందనే విషయంపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. యానిమల్ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు