The India House : పాన్ ఇండియన్ హీరో అయిపోయిన నిఖిల్

పాన్ ఇండియా సినిమా చేయాలంటే సిక్స్ ప్యాక్ లు, హై బడ్జెట్ లు అవసరం లేదు, సరైన కంటెంట్ ఉన్న సినిమా తీస్తే చాలు అని ప్రూవ్ చేసాడు నిఖిల్ సిద్దార్థ్. అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ని ప్రారంభించిన నిఖిల్ అనుకోకుండా యాక్టరై, ఆ తరువాత హీరో అయ్యి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో గా సంచలనం సృష్టిస్తున్నాడు.

కెరీర్ బిగినింగ్ లో హీరోగా నిలబడటానికి చేతికందొచ్చిన సినిమాలు చేసిన నిఖిల్. స్వామి రారా సినిమా హిట్ తో కెరీర్ పై ఫోకస్ పెట్టి, కమర్షియల్ సినిమాలని పక్కన పెట్టి, కంటెంట్ ఉన్న సినిమాలనే చేయడం ప్రారంభించాడు. అతి తక్కువ మందికి కలిసొచ్చే ఈ జానర్ లో నిఖిల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా , కేశవ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఇటీవలనే రిలీజైన కార్తికేయ2 సినిమాతో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయగా, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం 15కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాతో నిఖిల్ మార్కెట్ కూడా బాగానే పెరిగింది. దాంతో నిఖిల్ కూడా తన తరువాత సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్పై అనే చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఇటీవలనే రిలీజైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా తరువాత నిఖిల్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

- Advertisement -

వీర్ సావర్కర్ జీవిత చరిత్ర ఆధారంగా “ది ఇండియా హౌస్” పేరుతో ఒక సినిమా రాబోతుంది. కాశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ2 టీం వర్క్ చేస్తున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ లో ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న విక్రమ్ మరియు హీరో రామ్ చరణ్ కలిసి ప్రారంభించిన విమెగా పిక్చర్స్ అనే కొత్త బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది. రామ్ వంశి కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్బంగా ఈ సినిమాకి సంబందించిన గ్లిమ్స్ వీడియో ని మూవీ టీం విడుదల చేసారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు