SPY: రంగంలోకి దిగుతున్న నిఖిల్.. ఇక తొమ్మిది రోజులే..

నిఖిల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. కార్తికేయ2 తో ఇండియా వైడ్ గా క్రేజ్ ని సంపాదించుకున్న నిఖిల్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ జోనర్ మూవీ “స్పై” జూన్ 29 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. “స్పై” సినిమా నుండి విడుదలైన టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5భాషల్లో అలరించనుంది.

అయితే ఈ సినిమా పోస్ట్ పోన్డ్ అయ్యిందని, నిర్మాతకి నిఖిల్ కి పడట్లేదని గత కొన్ని రోజులుగా రకరకాల వాదనలు వినబడుతున్నాయి. అయితే చిత్ర యూనిట్ వాటన్నిటిని పరిష్కరించుకుని యధావిధిగా “స్పై” సినిమాను జూన్ 29 నే విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. వీటికి తోడు తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన స్టిల్ తో క్లారిటీ ఇచ్చేసారు. స్పై సినిమాలో ఒక గూఢచారిగా కనిపించబోతున్న నిఖిల్ రకాల గెటప్ లలో కనిపించనున్నాడు. అందులో ముస్లిం దుస్తుల్లో ఉన్న గెటప్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని గుర్తు చేస్తూ వదిలింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ని మరో రెండు రోజుల్లో అనగా జూన్ 23 లేదా 24 న విడుదల చేయనున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడం తో నిఖిల్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ సినిమా వస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేసినా నిఖిల్ రంగంలోకి దిగి వాటన్నిటిని పరిష్కరించుకుంటూ సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు