SPY: ఐశ్వర్యకి తన సినిమాల్లో అన్నిటికంటే ఇష్టమైన పోస్టర్ ఇదేనట!

టాలీవుడ్ లో స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న చిత్రం “స్పై”. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో హీరొయిన్ గా తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. తెలుగులో ఈమెకిదే మొదటి సినిమా. తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోయిన్ కి హిట్లు మాత్రం కరువయ్యాయి. అక్కడ మంచి సినిమాలు చేసినా నటిగా మార్కులు పడుతున్నాయి తప్ప హిట్స్ రావడం లేదు.

అందుకే ఇప్పుడు టాలీవుడ్ ని నమ్ముకుని “స్పై” సినిమాతో ముందుకు వస్తుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ అయితే ఐశ్వర్య ఇండియా వైడ్ గా ఫేమస్ అయిపోతుంది. అప్పుడు వరుస ఆఫర్లు వస్తాయని అనుకుంటుంది. దీనికి తోడు రీసెంట్ గా విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా “స్పై” సినిమా నుండి “జూమ్ జూమ్” అంటూ ఒక పాట విడుదలైన విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ఆ మెలోడీ సాంగ్ పై ఆసక్తికరమైన ట్వీట్ వేసింది ఐశ్వర్య.

ఈ లిరికల్ సాంగ్ విడుదల కి ముందు సాంగ్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలయింది. ఐశ్వర్య, నిఖిల్ రొమాంటిక్ మోడ్ లో కార్ పక్కన స్టైలిష్ గా ఉన్న ఆ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. అయితే ఈ పోస్టర్ ఐశ్వర్య నటించిన సినిమాల పోస్టర్స్ లో అన్నిటికంటే ఇష్టమైనదని పేర్కొంది. ఇక ఈ పోస్టర్ లో ఐశ్వర్య చేతిలో ఒక గన్ పట్టుకుని ఉంది. అంటే బహుశా “స్పై” లో ఐశ్వర్య కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ చేసి ఉండవచ్చు. ఇక “స్పై” సినిమాను జున్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు