NTR30: లాంచ్ అయ్యేది అప్పుడే!

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ తన కెరీర్ లో 30వ సినిమా గా దర్శకుడు కొరటాల శివతో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్టుని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మల్టీ లింగ్యూవల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొరటాల టీం విడుదల చేసిన ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలు కావలిసింది. అయితే పలు రకాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్.. వచ్చేనెల అంటే మార్చి 18వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న హీరోయిన్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మార్చ్ మొదటి వారంలోనే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే దానిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు