OTT : తమన్నాకు అంత సీన్ ఉందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ కి అడుగు పెట్టి దాదాపు 18 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. తమన్నా ఇప్పటి వరకు అన్ని గ్లామరోస్ రోల్స్ లోనే నటించింది. తన గ్లామర్ షో ను చూసే తమన్నాకు మిల్కీ బ్యూటీ అని పేరు వచ్చిందని చెప్పొచ్చు.

అయితే మిల్కీ బ్యూటీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. తమన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో బ్యూటీకి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను పక్కన బెట్టి, కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు చేయడానికి అవుతుందని తెలుస్తోంది.

లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది నయనతార, అనుష్క. ఇటీవల సమంత కూడా యూ టర్న్, ఓ బేబీ, యశోద, శాకుంతలం వంటి చిత్రాలతో ఈ జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఈ లిస్ట్ చేరడానికి తమన్నా కూడా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇటీవల టాక్ వచ్చింది.

- Advertisement -

అయితే దీని కోసం తమన్నా భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుందట. ఈ ప్రాజెక్ట్ కు 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు పారితోషకం డిమాండ్ చేసిందని గుస గుసలు వినిపిస్తున్నాయి. తమన్నా ఇప్పటికే, స్టార్ డం కోల్పోయి బాధపడుతుంది. ఇలాంటి సమయంలో తనకు పెద్దగా అనుభవం లేని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమేంటి ? అని సినీ విశ్లేషకులే కాదు.. అభిమానులు సైతం అంటున్నారు.

తమన్నా రెమ్యునరేషన్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తే.. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లు కూడా రావని, కెరీర్ క్లోజ్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మిల్క్ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు