Pawan kalyan : OG ఆగయా !

సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న పవన్ కళ్యాణ్ OG సినిమా షూట్ ఇటీవలే మొదలైంది. ముంబై లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఈ రోజు (మంగళవారం) జాయిన్ అయ్యాడు.

గత వారం రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో ఉన్నపవన్ సోమవారం రాత్రి ముంబై చేరుకున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. అండర్ వరల్డ్ గ్యాంగ్స్ నేపథ్యం లో ఉండబోతున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. పవన్ గతంలో బాలు, పంజా సినిమాలో కొద్దీ సేపు గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించారు.

పవన్ కి గన్స్ అంటే చాల ఇష్టం అందుకే ఆయన గన్స్ ఉండే సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరోపక్క సుజీత్ కూడా గన్స్, వైలెన్స్ ఉన్న హై క్లాస్ యాక్షన్ సినిమాలు తీయటంలో దిట్ట. సుజీత్ గతంలో తీసిన సాహూ సినిమాలో గన్స్ తో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉంటాయి. సాహూ రిజల్ట్ పరంగా తెలుగులో నిరాశపరిచిన హిందీలో మాత్రం వసూళ్ల సునామిని సృష్టించింది.

- Advertisement -

సాహూ తరువాత సుజీత్ తో సినిమా చేయాలనీ చాలా మంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. కానీ సుజీత్ కి మాత్రం తెలుగు సినిమా చేయాలనీ ఉండటంతో వాళ్లందరికీ నో చెప్పాడు. చాలా గ్యాప్ తీసుకొని పవన్ కోసం ఈ OG కథని సిద్ధం చేసాడు.

సుజీత్ కి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది కానీ సుజీత్ ఆ సినిమా చేయకుండా పవన్ తో సినిమా చేయాలనీ భీష్మించుకుని కూర్చున్నాడు. ఫైనల్ గా సుజీత్ అభిమానించే పవన్ తోనే ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. పవన్ OG సినిమా కోసం వారం రోజుల పాటు ముంబై లోనే ఉంటారు. ఆ తరువాత హైదరాబాద్ చేరుకొని హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటారు. ఆ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కి వెళ్తారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు