OG: మొదటిసారి ఒక ఇంగ్లీష్ టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ జనవరి 30న పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టారు. అయితే క్లాప్ బోర్డు మీద టైటిల్ ”దే కాల్ హిం ఒరిజినల్ గ్యాంగ్స్టర్” అని ఉంది. గతంలో ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ని విడుదల చేసినప్పుడు ఇదేదో ట్యాగ్ లైన్ అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఇదే టైటిల్ గా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవర్ స్టార్ సినిమాలలో ఇప్పటి వరకు ఇలాంటి ఇంగ్లీష్ టైటిల్ లేదు. ఇక మాస్ ఫ్యాన్స్ కి ఈ ఇంగ్లీష్ లైన్ కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే అయినా ఫ్యాన్స్ ఇప్పటికే ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ కి షార్ట్ కట్ గా ‘ఓ జి’ అని ట్రెండ్ చేసేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాంచ్ జరిగినప్పటినుంచి స్టోరీ గురించి సోషల్ మీడియా లో ఎన్నో చర్చలు జరిగాయి.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పాటలు ఉండవని, ఫైట్ సీన్స్ ఉండవని, పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ గంట లోపే ఉంటుంది అని ఏవేవో వార్తలు వినిపించాయి. ఇక వీటిలో ఎంత వరకు నిజం ఉంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

- Advertisement -

ఇక ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ముచ్చట గా మూడోసారి పవన్ తో థమన్ కి ఛాన్స్ దొరికింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత ఈ సినిమా కి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సాంగ్స్ ఉండవు అని వార్తలు వచ్చినప్పటికీ పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం థమన్ ని తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ చిత్రం లో ఇతర నటీనటుల గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు