Pawan Kalyan : లుక్ అదిరింది బాస్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా, అసలు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. సాధారణ ప్రేక్షకులే కాదు.. సినీ నటీనటులు కూడా పవర్ స్టార్ ఫ్యాన్ గా ఉంటారంటే ఆయన ఫాలోయింగ్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలను, ఇటు సినిమాలను నడిపిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో.. హరి హర వీరమల్లు, #OG తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. అలాగే వినోదయ సీతం తెలుగు రీమేక్ కు కూడా పవన్ సైన్ చేశాడు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది.

ఇదిలా ఉండగా, నేడు సాహో సుజిత్ దర్శకత్వంలో రాబోయే #OG సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్, నిర్మాతలు డీవీవీ దానయ్య, అల్లు అరవింద్, దిల్ రాజ్, రామానాయుడు వచ్చారు. అయితే దీనిలో పవన్ కళ్యాణ్ హైలైట్ గా కనిపించారు.

- Advertisement -

#OG పూజా సమయంలోని పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటు లుక్ వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తున్నాయి. దీంతో #OG సినిమాలో పవన్ లుక్ ఇదే అయి ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడతున్నారు.

కాగా పవర్ స్టార్ కి సుజిత్ వీరాభిమాని. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ను ఒక అభిమాని ఎలా చూడాలి అని అనుకుంటారో.. అలానే సుజిత్ చూపిస్తాడని నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నాడు. ఏది ఏమైనా, పవన్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తున్నాయి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు