OG: గిబ్రన్ కాదు, అనిరుధ్ కాదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా సాహూ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మించిన డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ షూటింగ్ జనవరి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటికే విడుదల అవ్వటానికి లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో చిత్రికరించబడుతున్న హరి హర వీర మల్లు షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా లో నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. అలాగే సోనాల్ చౌహన్ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ బ్యాలన్స్ ఉంది అని సమాచారం.

సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహూ లో యాక్షన్ సీన్స్ చూస్తే, ఆ డైరెక్టర్ పవర్ స్టార్ కాంబినేషన్ లో ఇంకెంత పవర్ఫుల్ గ ఉండబోతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. దానికి తోడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్ అయినప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచే చాలామంది అభిమానుల్లో సుజీత్ కూడా ఒకడు.

- Advertisement -

ఇక ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా గిబ్రాన్ అని అందరూ అనుకున్నారు, ఆ తరువాత ఇంస్టాగ్రామ్ లో సుజీత్ అనిరుద్ ని ఫాలో అవ్వటం తో ఫోకస్ అనిరుద్ వైపుకు మారింది. ఇక ఈ రోజు పూజ తో ఈ విషయం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందిస్తుంది ఎస్.ఎస్ థమన్.

సాహో సినిమా సుజిత్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పవర్ స్టార్ తో చేయబోయే సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు