Prashanth Varma : మాస్ మహారాజతో ఫిక్స్ ?

ఇటీవల మాస్ మహారాజ రవితేజ నుంచి వచ్చిన సినిమాలు ‘‘ధమాకా”, ‘‘వాల్తేరు వీరయ్య’‘ .ఈ రెండు సినిమాలు రవితేజకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చాయి. వీటితో పాటు ఈ మాస్ హీరో రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదల కాక ముందే.. మరో సినిమాకు రూట్ క్లీయర్ చేసుకుంటున్నాడు.

తన తర్వాత సినిమాను హాన్ మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీ భాషలో తెరకెక్కించబోతున్నారని సమాచారం. అయితే ప్రశాంత్ వర్మ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు.

ప్రస్తుతానికి ప్రశాంత్ ఇప్పుడు తేజ సజ్జ తో ”హనుమాన్” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. హాన్ మాన్ ను ఈ ఏడాది వేసవి కానుకగా మే 12న విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరోస్ సినిమాటిక్ యూనివర్స్ లో మరో సినిమా చేయబోతున్నాడు.

- Advertisement -

అయితే రవితేజతో చేసే సినిమా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనా ? లేదా డిఫరెంట్ స్టోరీతో చేయబోతున్నాడా ? అనేది తెలియాల్సి ఉంది. కాగా నందమూరి బాలయ్యతో కూడా ప్రశాంత్ వర్మ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ‘ టీజర్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం అందించిన విషయం తెలిసిందే. టీజర్ బాగా నచ్చడంతో ప్రశాంత్ వర్మతో బాలయ్య ఓ సినిమా చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్.

ఇప్పటికే బాలయ్య వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో ప్రశాంత్ ఈలోపు రవి తేజ తో ఒక సినిమా కు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై ఓ క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉంది.

 

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు