Pushpa2 : పుష్ప రాజ్‌తో చిందేయ్యడానికి బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్.. ఫోటో లీక్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తెలుగు ఇండస్ట్రీ లెక్కాల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంతో పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిత్ర యూనిట్ కూడా ఊహించనంత పెద్ద హిట్ అందుకున్న పుష్పకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ కంటే భారీగా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప ది రైజ్ లో స్టోరీ, అల్లు అర్జున్ యాక్టింగ్ తో పాటు సమంత చేసిన ఊ అంటావా మావా… ఊ ఊ అంటావా మావా… స్పెషల్ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది.

ఈ పాట పడిన ఇంద్రావతి చౌహాన్ గొంతు, సమంత మాస్ స్టెప్స్ తో సినీ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ లో కూడా ఓ ఐటెం సాంగ్ పెట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా ఊ అంటావా మావా… సాంగ్ రేంజ్ లో ఉండాలని సుక్కు ప్రణాళికలు రచిస్తున్నాడు. అందుకోసం బాలీవుడ్ బ్యూటీని దింపాలని చూస్తున్నాడని గత కొద్ది రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఏ బాలీవుడ్ నటి వస్తుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అల్లు అర్జున్ ఉన్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఫోటోను సీరత్ కపూరే షేర్ చేసింది. దీనికి “డ్యాన్సర్స్ కి ఎగిరేందుకు రెక్కలు అవసరం లేదు… వారిని ఎనర్జీనే లీడ్ చేస్తుంది” అనే క్యాప్షన్ ను కూడా జోడించింది. అంటే అల్లు అర్జున్ తో తాను డ్యాన్స్ చేస్తున్నానని చెప్పకనే చేప్పేసింది. దీంతో పుష్ప ది రూల్ లో స్పెషల్ సాంగ్ ను సీరత్ కపూరే చేస్తుందని, దానికి సంబంధించిన ఫోటోనే ఇది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నాడు. మరీ ఈ ఫోటో ఆ యాడ్స్ కు సంబంధించిందా ? లేదా నిజంగానే పుష్ప 2లోని స్పెషల్ సాంగ్ లోనిదా ? అనేది తెలియాల్సి ఉంది. అయితే, సీరత్ కపూర్, అల్లు అర్జున్ కలిసి యాడ్ చేసే పరిస్థితి లేదని, ఇది పుష్ప2లోని ఐటెంసాంగ్ లోని ఫోటోనే అంటూ ఫ్యాన్స్ చాలా గట్టిగానే చెబుతున్నారు. చూడాలి మరి, ఇందులో ఎంతవరకు నిజం ఉందో

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు