Pushpa2: నార్త్‌ లెక్కలు సెట్ చేస్తున్న లెక్కల మాస్టార్

లెక్కల మాస్టార్ సుకుమార్ సినిమాలు అంటే ఎప్పుడూ స్పెషలే. ఆర్య నుంచి రంగస్థలం వరకు సుక్కు ఒక్కో సినిమా ఒక్కో రికార్డ్. సహజత్వంతో కూడిన స్టోరీలతోనే సుకుమార్ సినిమాలను తెరకెక్కిస్తాడు. అదే ఆయన ప్రత్యేకత అని చెప్పొచ్చు. సుక్కు నుంచి ఇటీవల వచ్చిన పుష్ప ది రైజ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ కు ముందు తెలుగులో మంచి అంచనాలు ఉండేవి. కానీ, నార్త్ స్టేట్స్ లో మాత్రం పుష్పకు ఎలాంటి అంచనాలు లేవు. కొంత మందికి పుష్ప అనే ఓ సినిమా వస్తుందని కూడా తెలియదు.

అలాంటి స్థానం నుంచి నార్త్ లో అత్యధిక కలెక్షన్లు తీసుకువచ్చిన సౌత్ సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో పుష్ప ది రైజ్ మూవీకి 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా, రాబోయే పుష్ప ది రూల్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు, ఇంట్రెస్ట్‌ను క్రియేట్ అయింది. ఇది పుష్ప2కు ఫ్రీ ప్రమోషన్స్ అని చెప్పుకొవచ్చు. ఇది పుష్ప టీంకు ఒక సవాల్ లాంటిది కూడా. అయితే నార్త్ ప్రేక్షకుల మెప్పుకోసం సుక్కు భారీగానే ప్లాన్స్ చేస్తున్నాడు.

ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశాడని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోను గెస్ట్ గా తీసుకువచ్చే ఆలోచనలో సుక్కు ఉన్నాడట. ఆ స్టార్ హీరో పాత్ర దాదాపు 10 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ పాత్రతో సినిమా ఆసక్తికరమైన మలుపు తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ 10 నిమిషాలు థియేటర్ లో ప్రేక్షకుల ఉర్రూతలూగిపోతారని తెలుస్తోంది.

- Advertisement -

దీంతో పుష్ప ది రూల్ కి నార్త్ స్టేట్స్ లో మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉందని సుక్కు భావిస్తున్నాడట. మరి ఈ సీక్వెల్ సినిమాలో ఏ బాలీవుడ్ హీరోను తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు