Raashi Khanna: భారతీయ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్

రాశీఖన్నా, ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశిఖన్నా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లోనటించి తనదైన ముద్రను వేసుకుంది.

కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తనదైన సత్తాను చాటుతుంది. ఇదివరకే రుద్ర ‘ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ వెబ్‌ సిరీస్‌లో డాక్టర్‌ ఆలియా చోక్సీ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న రాశీఖన్నా. ఇప్పుడు ఫర్జీ అనే సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది.

షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్–డికేలు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో మేఘ అనే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించిన రాశీఖన్నా, ఒక ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ ను చేసింది. మేఘ పాత్రలో అదిరిపోయే పెరఫార్మన్స్ తో ఆడియన్స్ ను సప్రైజ్ చేసింది.

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ అని సంబంధం లేకుండా ఆడియన్స్ ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్న ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా అనే స్థాయికి మన సినిమాలు వచ్చేసాయి. ఈ తరుణంలో సౌత్ నార్త్ దర్శకుల సినిమాలకు రాశీఖన్నా పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. సినిమాలలో సెటిల్డ్ పెరఫార్మన్స్ తో పాటు సోషల్ మీడియాలో తన అందంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటుంది ఈ భామ.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు