Veerupaksha : ఇలాంటి పాత్రలో రాజీవ్ కనకాలని ఎప్పుడు చూసి ఉండరు !

తెలుగులో సపోర్టింగ్ రోల్ అంటే ముందుగా గుర్తుకొచ్చే వారిలో ” రాజీవ్ కనకాల ఒకరు. రాజీవ్ కనకాల తెలుగు సినిమాలలో దాదాపు అన్ని రకాల పాత్రలు చేసారు. నెగిటివ్ ,పాజిటివ్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలలోను ఆయన ప్రేక్షకులని మెప్పించారు.

అయితే గత కొద్దీ రోజులుగా ఆయన సినిమాలలో ఎక్కువ కనిపించలేదు. ఆయన ఫాదర్ దేవదాస్ కనకాల చనిపోయాక రాజీవ్ చాలా డిప్రెషన్ కి గురయ్యారు. సినిమాలకి చాలా కాలం బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకి కోలుకొని మళ్ళీ యథావిథిగా సినిమాలు చేయటం స్టార్ట్ చేసారు . అయితే ఒక చిన్న సినిమా షూటింగ్ సంబంధించి అవుట్ డోర్ వెళ్లిన రాజీవ్ కనకాలకి ఆక్సిడెంట్ అయింది. దాంతో మళ్ళీ సినిమాలకి బ్రేక్ పడింది. ఈ మధ్యనే ఆయన పూర్తిగా కోలుకొని గత కొద్దీ రోజులుగా వరుస సినిమాలు చేస్తున్నారు.

అయితే మరి దర్శకులు అనుకోని రాసుకుంటారో లేక క్యారెక్టర్ డిమాండో తెలీదు గాని రాజీవ్ కనకాల చేసే పాత్రలన్నీ కూడా సినిమా క్లైమాక్స్ కి చనిపోతాయి. ఇది గత కొద్దీ సంవత్సరాలుగా రాజీవ్ కనకాల ఇలా సినిమాలలో చనిపోవటం తెలుగు పెద్ద హీరోల సినిమాల్లో కమర్షియల్ సక్సెస్ ఫార్ములాగా అయిపొయింది. ఒకవేళ బ్రతికి ఉన్నడో అది ఆశ్చర్య పోవాల్సిన విషయమే. రీసెంట్ గా రిలీజ్ అయిన బింబిసార, వీర సింహ రెడ్డి సినిమాలో కూడా రాజీవ్ కి మళ్ళీ ఇలాంటి క్యారెక్టరే చేసారు. రాజీవ్ సినిమాలో ఉన్నాడు అంటే ఎక్కువ సేపు ఉండడులే అంటూ సోషల్ మీడియా లో మిమ్స్ రావడం పరిపాటి అయింది.

- Advertisement -

అయితే గత శుక్రవారం రిలీజ్ అయిన విరూపాక్ష సినిమాలో మాత్రం అందరిని ఆశ్చర్య పరిచేలా రాజీవ్ కనకాల సినిమా క్లైమాక్స్ వరకు ఆయన బ్రతికే ఉన్నాడు.చివరి వరకైనా చనిపోతాడేమో అని అనుకున్న రాజీవ్ బ్రతికే ఉండేసరికి సోషల్ మీడియాలో మిమ్స్ రావడం మొదలయ్యాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు