Ram Charan: తండ్రి కాబోతున్నట్టు మొదట ఎన్టీఆర్ తోనే చెప్పాను

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ మద్య స్నేహం గురించి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మేకింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందని చాలామంది భావించారు. కానీ అంతకంటే ముందు నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని ఎన్టీఆర్ – చెర్రీ చెప్పడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది.

టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సందర్భంలోనే ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఇక దర్శకదీరుడు జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికన్ ఫేమస్ టెలివిజన్ ప్రోగ్రాం ” గుడ్ మార్నింగ్ అమెరికా” నుంచి చెర్రీకి ఆహ్వానం అందడంతో అక్కడ వాలిపోయారు.

ఈ షోలో పాల్గొన్న రామ్ చరణ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. తారక్ తో స్నేహం పై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. అయితే రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించడానికన్నా ముందే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి చెప్పానని రామ్ చరణ్ తెలిపారు. తారక్, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, అన్ని విషయాల గురించి తాము మాట్లాడుకుంటామని చెప్పారు.

- Advertisement -

ఇక మెగా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆయన తన తదుపరి సినిమాతో గ్లోబల్ సినిమాపై తన సత్తాను చాటనున్నారని తెలిపారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు