Ram Charan: ఆ హీరోయిన్‌‌ను కళ్ళు ఆర్పకుండా చూస్తా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు చరణ్‌. అయితే, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథంలో వస్తున్న ఈ సినిమా RC 15 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

గత కొంతకాలంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ హాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్లలో తన క్రష్ ఎవరైనే ప్రశ్న ఎదురయింది చెర్రీకి. దీనికి రామ్ స్పందిస్తూ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ అని సమాధానం ఇచ్చాడు.

‘జూలియా రాబర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆమెను స్క్రీన్ పై ఎప్పుడు చూసినా అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉండిపోతా. దాన్ని అబ్సేషన్ అంటారో లేదో తెలియదు కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ‘ప్రెట్టి ఉమెన్’ మూవీ నుంచి నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ ని. అలాగే ‘ఎంట్రాప్ మెంట్’ హీరోయిన్ కేథరిన్ జీటా జోన్స్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది మార్క్ ఆఫ్ జోరో. ఈ సినిమా నుంచి ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

కాగా, చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి రివీల్‌ చేశారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు