Rana Naidu: ఈ వెబ్ సిరీస్ పై నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం!

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. అమెరికన్ డ్రామా సిరీస్ “రే డోనోవన్” ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సిరీస్ విడుదలైంది. మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డ్రామా సిరీస్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. విపరీతమైన అశ్లీలత, అసభ్య పదజాలం మూలంగా ఈ సిరీస్ మేకర్స్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ సిరీస్ లో పరిమితికి మించిన బూతులు ఉండడం, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో వెంకటేష్, రానాలు సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ ఎఫెక్ట్ అంతకంతకు పెరుగుతూ ఉండడం, ఓటిటి కంటెంట్ పై కోర్టులో కేసులు వేయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది నెట్ ఫ్లిక్స్. ఈ సిరీస్ కు నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో చాలా భాషలలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో కూడా ఉండడంతో తాజాగా తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం బూతులు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ తో అలా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడం పట్ల తెలుగు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు విజయశాంతి, శివ కృష్ణ వంటి సెలబ్రిటీలు సైతం రానా నాయుడు సిరీస్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ సిరీస్ పై తీవ్రమైన నెగిటివ్ స్ప్రెడ్ కావడంతో.. దీన్ని నెట్ ఫ్లిక్స్ తొలగించినట్లు సమాచారం. అయితే ఇది పొరపాటున జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? అనే విషయంలో ఈ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఇంకా వివరణ ఇవ్వలేదు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు