Rashmika Mandanna : సక్సెస్ సీక్రెట్ రివీల్..

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది రష్మిక మందన్నా. కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన నటనతో పాటు హవభావాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అందుకే ఈమెను.. నేషనల్ క్రష్ అంటారు. అంతే కాదు.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో కూడా రష్మిక నటించింది.

ఈ నేషనల్ క్రష్.. పుష్ప, వారిసు (తెలుగులో వారసుడు)తో రెండు సార్లు 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ ఫిట్ సాధించిన హీరోయిన్ గా రికార్డును కూడా నమోదు చేసింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తో పాటు భారీ అంచనాలు ఉన్న బాలీవుడ్ మూవీ యానిమల్ లో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం దాదాపు ఖాయమని ఇప్పటి నుంచే విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. అయితే రష్మిక సక్సెస్ సీక్రెట్ ఏంటి ? అని తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

తాజాగా దీనిపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందించింది. తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేసింది. “యాక్టింగ్ పరంగా ఎప్పుడూ కొత్త సవాళ్లు వస్తాయి. వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కొటేనే మేలు జరుగుతుంది. సినిమాల్లో కష్టమైన పాత్రనే చేయగలనా.. అని భయం వేస్తుంది. కానీ, ఆ పాత్రలో వచ్చే సవాళ్లను స్వీకరించి ముందుకు వెళ్తా. నేను మొండిగా ఉండటానికి కారణం ఉంది. యాక్టింగ్ కోసం ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. ఎక్కడా చదువుకోలేదు.. డైరెక్టర్ చెప్పింది చేయడం తప్పా.. నేను కొత్తగా చేసేదేమీ లేదు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నా.అందువల్లే నేను చేసిన ప్రతీ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నాతో పాటు ప్రయాణం చేస్తుంటుంది. ఒక సినిమాలో చేసిన పాత్రకు రాబోయే సినిమాలో చేయబోయే పాత్రకు మార్పు ఉండాలి. అందుకోసం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాను. అలాగే ఎలాంటి పాత్ర చేసినా.. మనసు పెట్టి చేస్తా. కష్టం అనిపించినా.. ఇబ్బందులు ఎదురైనా.. నాలో నేను సర్ది చెప్పుకుని ముందుకెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి” అంటూ తన సక్సెస్ సీక్రెట్ ను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది.

- Advertisement -

కాగా.. ప్రస్తుతం రష్మిక మందన్నా అనేకరకాలుగా ట్రోల్స్ కి గురవుతుంది. అయినా, వరుసగా భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు