Rishab Shetty: కాంతార 2 సీక్వల్ కాదు ప్రీక్వల్ అప్డేట్

గతేడాది చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం కాంతారా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్ తో తిరగేకి రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కన్నడంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలోని క్లైమాక్స్ కు ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే.

అయితే కాంతార సినిమా రిలీజ్ అయ్యి వంద రోజులు అయింది. ఇండియా నుంచి ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో కాంతార కి చోటు దక్కింది. దీంతో కాంతారా సినిమాపై అందరి దృష్టిపడింది. ఒక రీజనల్ సినిమాగా ప్రయాణం మొదలుపెట్టిన కాంతారా సినిమాకి ఈరోజు ఇంటర్నేషనల్ రీచ్ కావడంతో చిత్ర యూనిట్ క్లౌడ్ నైన్ లో ఉన్నారు. గతంలో కాంతారా సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే త్వరలో చెప్తాను అని సమాధానం ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా 2 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు.

అయితే కాంతారా 2 ప్రకటించిన నెలలు గడుస్తున్న ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దీనిపై హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి కీలక అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాంతారా 2 పై స్పందించారు. ‘వచ్చే ఏడాది కాంతారా విడుదల చేస్తాం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తాం. ఇది కాంతారకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో, దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపించబోతున్నాం. అలాగే పంజుర్లీకి సంబంధించిన సన్నివేశాలు పార్ట్ 2 లో ఎక్కువగా ఉంటాయి’ అంటూ రిషబ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు