BRO : మెగా హీరో సూసైడ్ అటెంప్ట్..?

Shocking News

మెగా హీరో సూసైడ్ అటెంప్ట్..ఎస్.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. మెగా హీరో సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నారంటూ ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ అసలు విషయం తెలిసి సోషల్ మీడియాలో ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చూపెట్టడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం “బ్రో”. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులను తెగ టెన్షన్ పెడుతుంది. అదేంటంటే.. ఈ సినిమా క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నాడట. లవ్ ఫెయిల్యూర్, పలు కారణాలవల్ల సూసైడ్ చేసుకునే సమయంలో పవన్ కళ్యాణ్ దేవుడిలా వచ్చి కథను మలుపు తిప్పబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు