Saif Ali Khan: మా బెడ్‌‌రూంలోకి వచ్చి ఫొటోలు తీసుకోండి

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వెంటనే కెమెరాలో బంధించేస్తారు. ఉదయం జిమ్ లకు వెళ్ళినప్పటి నుండి నైట్ పార్టీలు అంటూ రాత్రుళ్ల వరకు తిరిగే సెలబ్రిటీలను వెంటనే క్లిక్ మనిపిస్తారు మీడియా వాళ్ళు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను క్యాప్చర్ చేయాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు తారలకు ఇది విసుగు పుట్టిస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ ఓ పార్టీకి వెళ్లారు. మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు హాజరై గురువారం రాత్రి కరీనా – సైఫ్ తిరిగి వారి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో వీళ్ళిద్దరిని ఫోటోగ్రాఫర్ లు ఫాలో అవుతూ సార్ ఒక ఫోటో ప్లీజ్ అంటూ కోరారు.

కానీ అటు కరీనా, ఇటు సైఫ్ ఇద్దరు దీనిపై స్పందించలేదు. దీంతో మళ్లీ మళ్లీ అడిగేసరికి సైఫ్ అలీ ఖాన్ కాస్త వెటకారంగా సమాధానమిచ్చాడు. “ఓ పని చేయండి, మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి ” అని సరదాగా వ్యాఖ్యానించాడు. అది విని కరీనా చిన్నగా ఓ నవ్వు నవ్వింది. దీంతో అక్కడున్న ఓ ఫోటోగ్రాఫర్ ‘సైఫ్ సార్ మీరంటే మాకు ఎంతో ఇష్టం’ అని అరిచాడు. దీనికి సైఫ్ ‘ మాకు మీరంటే ఎంతో ఇష్టం’ అని రిప్లై ఇస్తూ వెళ్ళిపోయారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి నెటిజెన్లు వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం సైఫ్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటిస్తున్నాడు.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు