SAINDHAV : వెంకీ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రూట్ మార్చాడు. ఇప్పుడు యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. ఫ్యామిలీ సినిమాలతో అలరిస్తున్న వెంకీ మామ ఇప్పుడు రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. నిన్న ఆ సినిమా టైటిల్ నీ ప్రకటించారు.

హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్‘ అనే చిత్రంలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర టైటిల్ ని ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు.

కొద్దిగా గడ్డంతో, ముఖంపై గాయాలతో కనిపించారు. వెంకటేష్ సైంధవ్ ఫస్ట్ గ్లింప్స్ ఆధ్యాంతం ఆకట్టుకోవడంతోపాటు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇది వెంకటేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ లోను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేష్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ”నవాజూద్దీన్ సిద్ధిఖీ” అనే బాలీవుడ్ స్టార్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే తెలుగులోకి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ ఇస్తున్నాడు .ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడా, లేక కీలక రోల్ లో కనిపిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పేట సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు