Citadel: మునుపటి ఉత్సాహంతో రెచ్చిపోయిన సమంత..!

టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ సమంత ఇటీవల మాయోసైటిస్ నుండి కోలుకున్న తరవాత వరుస సినిమాలతో బిజీ అవుతోంది. నాగచైతన్య తో  డైవర్స్ ఒక పక్క, మాయోసైటిస్ వ్యాధి మరో పక్క సమంత జీవితాన్ని కొంత కాలం పాటు అంధకారంలోకి నెట్టేశాయి. అయినప్పటికీ ఏ మాత్రం సడలని పట్టుదలతో వాటిని ఎదుర్కొని నిలదొక్కుకుంది సమంత. విడాకుల తర్వాత అక్కినేని ఫ్యాన్స్, పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు పని గట్టుకొని సమంతని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవ్వటంతో ఆ విమర్శలు మరింత పెరిగాయి. వాటికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చి తిప్పి కొట్టిన సమంత విమర్శకుల నోళ్లు మూయించింది.

శాకుంతలం డిజాస్టర్ అయిన ప్రభావం సమంత క్రేజ్ పై ఏ మాత్రం పడలేదని ఇటీవల జరిగిన సిటాడెల్ ప్రీమియర్ వేదిక నిరూపించింది. ఆ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన ప్రియాంక చోప్రా కంటే ఎక్కువ ఫోకస్ సమంతకి వచ్చింది ఆ వేదికపై. ఇదిలా ఉండగా తాజాగా సమంత నటించిన పెప్సీ యాడ్ విడుదలైంది, ఆ యాడ్ లో ట్రెడిషనల్ లుక్ లో అందంగా, స్టంట్ లు చేస్తూ డేరింగ్ గా కనిపించి ఆకట్టుకుంది.

యాడ్ రిలీజ్ అయిన కొద్ది సమయానికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమంతలో మునుపటి అందం, ఉత్సాహం కనిపిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కెరీర్ ని ప్రశ్నార్థకంగా మార్చిన పారిస్తుతుల నుండి పట్టుదలతో బయటపడిన సమంత మునుపటిలా ఎనర్జిటిక్ గా కనిపించటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తున్న సమంత మళ్ళీ హిట్ కొట్టి తన సత్తా చాటుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు