Samantha: నో లిమిట్స్ అంటున్న సమంత – అతనితో లిప్ లాక్..!

ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది లేడి సూపర్ స్టార్ సమంత. నాగచైతన్యతో విడాకుల తీసుకొని చాలా కాలం అవుతున్నా మీడియా తరచూ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. గత కొంత కాలంగా లేడి ఓరియెంటెడ్ చేస్తున్న సమంత కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఓ బేబీ, యశోద వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా హిట్స్ అందుకున్న సమంత ఇటీవల ఎన్నో అంచనాలతో విడుదలైన శాకుంతలం సినిమాతో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఫై దృష్టి పెట్టిన సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సిటాడెల్ హాలీవుడ్ వర్షన్లో ప్రియాంక చోప్రా నటించగా, ఇండియన్ వర్షన్లో సమంత నటిస్తోంది.

హాలీవుడ్ వర్షన్ సిటాడెల్ లో ప్రియాంక బోల్డ్ సీన్స్ లో నటించగా సమంత కూడా అదే రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేస్తుందా లేక ఇండియన్ వర్షన్లో మార్పులు చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత బోల్డ్ సీన్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సమంత అతనితో బోల్డ్ సీన్స్ తో పాటు ఒక లిప్ లాక్ సీన్ కూడా చేయనుందని సమాచారం.

ఇప్పటివరకు పెద్దగా రొమాంటిక్ సీన్స్ లో నటించని సమంత ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లెవెల్లో బోల్డ్ సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే, వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, సిటాడెల్ వెబ్ సిరీస్ పై అంచనాలు మాత్రం పెరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు