Samantha: ఓటీటీకి వచ్చినా సమంతను వెంటాడుతున్న ట్రోల్స్..!

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల దుశ్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా శాకుంతలం . ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ సినిమా డిజాస్టర్ అన్న సంగతి పక్కన పెడితే, సినిమా ప్రమోషన్స్ మొదలైన నాటి నుండి సమంతని టార్గెట్ చేసి అదే పనిగా ట్రోల్స్ చేసింది ఒక వర్గం. సినిమా రిలీజ్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాక ఆ ట్రోల్స్ మరింత పెరిగాయి. థియేటర్లలో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను నెల తిరగక ముందే ఓటీటీకి వదిలారు.
శాకుంతలం సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నా కూడా సమంత మీద ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు.  సోషల్ మీడియాలో కొందరు పనికట్టుకొని మరీ శాకుంతలం సినిమాపై, సమంతపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, గతంలో తనపై వచ్చిన విమర్శలకు ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తూ వచ్చిన సమంత, ప్రస్తుతం వస్తున్న ట్రోల్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో అన్న ఆసక్తి నెలకొంది సోషల్ మీడియాలో.
సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన లిరికల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. తర్వాత సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో కూడా సమంత నటిస్తోంది. సిటాడెల్ హాలీవుడ్ వర్షన్లో ప్రియాంక చోప్రా బోల్డ్ సీన్స్ లో నటించటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సమంత కూడా ప్రియాంక లాగే బోల్డ్ సీన్స్ లో నటిస్తుందా?, లేక ఇండియన్ వర్షన్లో వాటికి మార్పులు చేర్పులు చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు