Samantha : ఇతర భాషల్లో సక్సెస్ అవుతుందా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్, ఫాలోయింగ్ గురించి ఒక ముక్కలో చెప్పలేం. ఏ మాయ చేశావే సినిమాతో కెరీర్ ప్రారంభించిన సామ్, తొలి సినిమాతోనే ఆడియన్స్ ను మాయ చేసి, తన బుట్టలో వేసుకుంది. దీని తర్వాత వచ్చిన ప్రతి సినిమా తన కెరీర్ కు చాలా ఉపయోగపడింది. ప్రస్తుతం అయితే సమంత క్రేజ్ ఒక టాలీవుడ్ లోనే కాదు, దాదాపు అన్ని భాషల్లో ఉంది. అందుకే సామ్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది.

అయితే సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన యశోద, థియేట్రికల్ రన్ ముగిసేసరికి 80 కోట్ల వరకు సంపాదించింది. అంటే దాదాపు బడ్జెట్ కంటే రెండింతలు రిటర్న్ వచ్చాయి. నిజానికి సమంత సినిమాకు 40 కోట్ల బడ్జెట్ అంటే, ముందుగా అందరూ టెన్షన్ పడ్డారు. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత బడ్జెట్ అవసరమా ? లాభాలు రావాడం కష్టం అని అన్నారు. కానీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం సమంత శాకుంతలం అనే ఓ హిస్టారికల్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది. వాస్తవానికి ఈ బడ్జెట్ సమంతకు ఎక్కువే. సామ్ తెలుగు రాష్ట్రాల్లో గానీ, సౌత్ ఇండస్ట్రీలో గానీ, 80 కోట్ల మార్కెట్ లేదు. భారీ విజయం సాధించిన యశోదకు కూడా 80 కోట్లే వచ్చాయి. మరీ ఈ సినిమా విజయం సాధించాలంటే, 80 కోట్లు మాత్రమే వస్తే సరిపోదు. మరింత కావాల్సిందే.

- Advertisement -

సామ్ కి ఇప్పటి వరకు కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా వచ్చేవి. కానీ, శాకుంతలం సినిమా హిట్ కావాలంటే, తెలుగు రాష్ట్రాల్లోనే సక్సెస్ అవుతే సరిపోదు. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కూడా సక్సెస్ అవ్వాలి. భారీగా కలెక్షన్లు రావాలి. అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా బాగా ఆడాలి. అప్పుడే శాకుంతలం హిట్ అవుతుంది.. నిర్మాతలకు లాభాలు వస్తాయి.

మరి సామ్ కు 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే సత్తా ఉందా ? లేదా అనేది తెలియాలంటే.. ఈ సినిమా విడుదలయ్యే తేదీ ఫిబ్రవరి 17 వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు