Samyukta: విరూపాక్ష టీం నన్ను మోసం చేసారు

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ చిత్రంలో రానా భార్యగా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తన గ్లామర్ తో పాటు నటన, అభినయంతో యువతను తన వైపు తిప్పుకుంది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇటీవలే “సార్” చిత్రంతో అదిరిపోయే విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమా తమిళ్, తెలుగులో రెండిట్లోనూ సక్సెస్ అయింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ సాయిధరమ్ తేజ్ సరసన “విరూపాక్ష” అనే చిత్రంలో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రపతాకం పై భోగవల్లి బాపినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ పై సంయుక్త సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. ఉగాది రోజున విరూపాక్షలో తన పోస్టర్ విడుదల చేస్తామని చెప్పి.. చేయనందుకు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. చిత్ర యూనిట్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ మండిపడింది.

“నేను చాలా డిసప్పాయింట్ గా ఉన్నా.. నా బాధను వ్యక్తం చేసే ముందు విరూపాక్షలో నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగిందని చెప్పాలనుకుంటున్నాను. అమేజింగ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జ్ఞాపకాలని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. కానీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంది? నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాది రోజు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారు. ఎక్కడ రిలీజ్ చేశారు? ఆ పోస్టర్ ఏది? ” అంటూ ఆ సంస్థని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీంతో వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ.. సంయుక్త ని క్షమాపణలు కోరింది. ఈ సమస్యని పరిష్కరించేందుకు, పోస్టర్ రిలీజ్ చేసేందుకు కొంత సమయం కావాలని సంయుక్త కి రిప్లై ఇచ్చారు.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు