Love Aaj Kal: గిల్ తో అఫైర్… హింట్ ఇచ్చిన సారా ?

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ పేరు సంపాదించుకుంటున్న నటి సారా అలీ ఖాన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురే ఈ సారా అలీ ఖాన్.అయితే బాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు పై డేటింగ్ వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. బాలీవుడ్ లో సినిమా వార్తల కంటే ఈ డేటింగ్ న్యూసే హాట్ కేక్. అయితే సెలబ్రిటీలు కూడా ఇలా డేటింగ్ లతో బిజీగా గడుపుతుంటారు. ఈ మధ్య సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ కూడా ఇలాంటి విషయాలతో వార్తల్లో నిలుస్తుంది.

ఆమె ప్రముఖ టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్యూలో పాల్గొన్న సారాను మీరు క్రికెటర్ ను పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించారు. అయితే దీనికి తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ.

తనకు వారు ఎలాంటి వృత్తిలో ఉన్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోనని ఓపెన్ గానే చెప్పేసింది. వారు నటుడు, క్రికెటర్, వ్యాపారవేత్త, డాక్టర్ అయినా సరే అంటూ చెప్పుకొచ్చింది. తన మేధోస్థాయికి సరిపోయే వ్యక్తిగా ఉంటే చాలని ఆమె పేర్కొంది. కాగా… గతంలో తన అమ్మమ్మ ప్రముఖ నటి షర్మిల ఠాగూర్… మాజీ భారత క్రికెటర్ మన్సుర్ అలీ ఖాన్ పటౌడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… గతంలో సారా టెండూల్కర్, శుబ్ మన్ గిల్ డేటింగ్ డిన్నర్ లో ఒకే రెస్టారెంట్ లో కనిపించడంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోయినట్టు వైరల్ అయింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు