Swara Bhaskar: షాకింగ్ న్యూస్.. తల్లి కాబోతున్న వివాదాస్పద నటి..!!

బాలీవుడ్ వివాదాస్పద నటి స్వర భాస్కర్ గురించి మనందరికీ తెలిసిందే. తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకుంది స్వర భాస్కర్. ఆ తరువాత “వీరే ది వెడ్డింగ్” సినిమాలో తన నటనతో అదరగొట్టింది. అయితే ఈమె ఇటీవలే 2023 ఫిబ్రవరి 16న రాజకీయ నాయకుడు అయిన ఫహద్ జిరార్ అహ్మద్ ని రహస్యంగా వివాహం చేసుకుంది.

ఆ తర్వాత తన భర్తతో ఏర్పడిన పరిచయం నుండి పెళ్లి వరకు సాగిన జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది స్వర భాస్కర్. అయితే తాజాగా ఈమె ఓ చక్కటి శుభవార్తను తెలిపింది. తాను తల్లిని కాబోతున్నాను అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు అక్టోబర్ లో తన మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

“కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు  సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇది ఒక గొప్ప అనుభూతి. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం” అని భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం పెళ్లయిన కొద్ది రోజులకే ఇంత బేబీ బంప్ ఎలా వచ్చింది..? అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు