SPY: ఉన్నది 8 రోజులే… సాధ్యపడుతుందా?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజాగా చిత్రం “స్పై” వరల్డ్ వైడ్ జూన్ 29న రిలీజ్ కి సిద్ధమవుతుంది. కార్తికేయ2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిఖిల్ కి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించి పెట్టడంవల్ల “స్పై” స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు నిర్మాతకి హీరోకి పడటం లేదని రకరకాల పుకార్లు వినబడ్డాయి. అయితే ఆ సమస్యలన్నిటిని పరిష్కరించుకుని ఇప్పడు “స్పై” సినిమా ముందుగా ప్రకటించిన తేదినే విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఎప్పుడో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కూడా మేకర్స్ మాత్రం చిత్ర ప్రమోషన్ పై దృష్టి పెట్టలేదు. సినిమా కి సంబంధించి టీజర్, రెండు పాటల రిలీజ్ తప్ప ఇంకే ప్రమోషన్ కూడా చేయలేదు. బహుశా కొన్ని రోజుల కిందట సినిమాను వాయిదా వేద్దామని అనుకోవడం వల్ల ప్రమోషన్లు చేసి ఉండకపోవచ్చు.

అయితే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని రిలీజ్ జూన్ 29న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ కి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్లు ఎలా చేయగలరు అన్నది ప్రశ్న. కేవలం తెలుగులో రిలీజ్ అంటే తెలుగు హీరోయే కాబట్టి పెద్దగా ఆలోచించనవసరం లేదు. కానీ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించారు. స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా పాన్ ఇండియా సబ్జెక్టు లాగే ఉంది. మరి అలాంటప్పుడు ఇతర భాషల్లోనూ ఉన్న తక్కువ రోజుల్లో ఎలా ప్రమోట్ చేస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

సౌత్ భాషల్లో అంటే రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్ చేయవచ్చు. ఇటీవల వచ్చిన కాంతారా అలా వచ్చిందే. కానీ హిందీలో మాత్రం “స్పై” సినిమాకు గట్టి ప్రమోషన్లు కావాలి. ఎందుకంటే నిఖిల్ గత చిత్రం కార్తికేయ2 కి కరెక్ట్ టైం కి ప్రమోషన్లు చేయకపోవడం వల్ల అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టలేదు. కానీ కంటెంట్ బాగుండడంతో లాంగ్ రన్ లో ఆడింది. అన్ని సినిమాలకు అలా జరగవు. “స్పై” సినిమాకు ఎనిమిది రోజుల్లో ప్రమోషన్లు చేయాలంటే ఇండియాలో ఒక్కో సిటీ కి ఒక్కో రోజు వేసుకున్నా కూడా సరిపోదు. నెలముందు నుండే తమ సినిమాకి ప్రచారం చేసి ఉంటే ఇప్పుడు ఆదిపురుష్ లాగే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉండేది. అదీ గాక ఆదిపురుష్ లాంటి సినిమా తీసిన బాలీవుడ్ వాళ్ళకి తెలుగు సినిమా కంటెంట్ ఏంటో మరోసారి చూపించే అవకాశం దక్కేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయ్యిందనే చెప్పాలి.

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు 2018, బలగం చిత్రాల మాదిరి సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమా అయితే, ఎక్కువ ప్రమోషన్లు చేయకపోయినా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు సాధించవచ్చు. కానీ భారీ ఓపెనింగ్స్ సాధించే ఛాన్స్ కోల్పోవడం గ్యారెంటీ. ఇక జూన్ 22 న స్పై ట్రైలర్ ని AAA సినిమాస్ లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, తర్వాత ప్రమోషన్లు ఎలా చేస్తారో చూడాలి. మరి మిగిలిన 8రోజుల్లో “స్పై” సినిమాను ఎన్ని భాషల్లో ప్రమోట్ చేస్తారో ఎంత హైప్ తీసుకొస్తారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు