SSMB28 : పాత్రలు ఫిక్స్

సర్కారు వారి పాటతో 2022లో కమర్షియల్ హిట్ కొట్టిన మహేష్, ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమాలను అనౌన్స్ చేసారు. వర్కింగ్ టైటిల్ SSMB28తో ఈ చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. జనవరి రెండో వారం నుంచి షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్ ఉండబోతుందని నిర్మాణ సంస్థలు హరిక హాసిన్ క్రియేషన్స్, సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఇప్పటికే ప్రకటించాయి.

కాగా అతడు, ఖలేజా సినిమాలతో కొత్త కథలని అందిస్తూ స్టార్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలతో మహేష్ బాబును కొత్తగా పరిచయం చేసిన త్రివిక్రమ్ ఎప్పుడు SSMB28 సినిమాలో ఎలా చూపిస్తాడో చూడాల్సిఉంది.

ఇది ఇలా ఉండగా SSMB28 గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోయే నటీ నటులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్ఫామ్ చేశారని, ఆ నటీ నటులు విళ్లే, వారు చేయబోయే పాత్రలు ఇవే అంటూ వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, నదియా, టబు, సచిన్ ఖేడేకర్ SSMB28 లో కీలక పాత్రలు పోషిస్తున్నారట. మహేష్ కు సరితూగే విలన్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారట. మహేష్ బాబు తండ్రి పాత్రకు ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేశారని టాక్. హీరోయిన్ పూజా హెగ్డే కు తండ్రిగా మురళీ శర్మ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో పూజ హెగ్డేతో పాటు మురళి శర్మ కనిపిస్తారు. ఈ సినిమాలో కూడా వీరు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు