Suhas: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో..

కలర్ ఫోటో సినిమాతో యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, టాలెంటెడ్ హీరో సుహాస్ తమ సత్తా చాటుకున్నారు. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునాడు సుహాస్. కలర్ ఫోటో మూవీ నేషనల్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. అలాగే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల హిట్ ది సెకండ్ కేసులో మెయిన్ విలన్ పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

దీని తర్వాత సుహాస్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే సుహాస్ “రైటర్ : పద్మభూషణ్” అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇది ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో. “ఆనందరావు అడ్వెంచర్స్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుహాస్.

ఈ చిత్ర పూజ కార్యక్రమాలకు దగ్గుబాటి హీరో రానా ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదుల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో పాల బాటిల్ తో ఆకాశం లో నుంచి భూమి పైకి వస్తునట్టుగా కనిపించాడు హీరో సుహాస్. తలపై కిరీటం ధరంచి ఉండడంతో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు అని తెలుస్తోంది. కాగా ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా ఉదయ్ కోలా, అన్నే విజయ్ శేఖర్, సురేష్ కొతింటి నిర్మాణం వహిస్తున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు