Gossip: లవర్ ను వదిలేసిన సురేఖ వాణి కూతురు..?

నటి సురేఖ వాణి అంటే ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఆమె సాంప్రదాయానికి పెట్టింది పేరుగా చాలా సినిమాల్లో చీర కట్టు, బొట్టుతో ఉన్న అక్క, పిన్ని, ఒక్కోసారి తల్లి, వదిన ఇలాంటి పాత్రలు చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మదిలో మంచి చోటు సంపాదించుకుంది. ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇదంతా సినిమాల్లో అంతే… ఆమె పర్సనల్ గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీతా కోసం లగ్జరీ కారును కొన్నారు. ఎంజీ కంపెనీకి చెందిన కాస్ట్లీ కారను సురేఖ వాణి కొనుగోలు చేసింది.

ఇది ఇలా ఉంటే గతంలో సుప్రీత తన జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. తాను ప్రేమలో ఉన్నానని, తన బాయ్ ఫ్రెండ్ నీ పరిచయం చేసింది. అతడి పేరు రాఖి జోర్దన్. పలు ర్యాప్ సాంగ్ లకు ఇతను ఆల్బమ్స్ కూడా చేశాడు. అంతేకాకుండా ఎక్కువగా అమెరికాలో ఉంటాడు. అయితే ఆ తర్వాత సుప్రీత బాయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు. అంతేకాకుండా సుప్రీత ఎమోషనల్ స్టేటస్ లు పెట్టడం, బ్రేకప్ స్టేటస్ లు పెట్టడంతో బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిందా..? అన్న అనుమానాలు నెటిజన్లకు మొదలయ్యాయి. మరోవైపు రాఖి జోర్దన్ కూడా ఎప్పుడూ సుప్రీతతో కలిసి దిగిన ఫోటోలను కానీ, వారి ప్రేమకు సంబంధించిన విషయాలను కానీ షేర్ చేయలేదు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని ఉంటారని కొంతమంది ఆమె ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు