Tapsee: తాప్సి పై కేసు ఫైల్

తాప్సీ పన్ను.. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది తాప్సి. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్, కమర్షియల్, బయోపిక్ లు అంటూ కెరీర్ లో దూసుకెళ్తుంది. అయితే మార్చి 12వ తేదీన ముంబైలో లాక్ మీ ఫ్యాషన్ వీక్ 2023 ఫ్యాషన్ షో జరిగింది.

ఈ షోలో తాప్సీ పన్ను రాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువులు ఆరాధించే లక్ష్మీదేవి లాకెట్ ను ధరించడమే ఇప్పుడు వివాదంగా మారింది. ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా లక్ష్మీదేవి లాకెట్ ధరించి ర్యాంప్ వాక్ చేయడం పై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఆమె మెడలో వేసుకున్న ఆభరణం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్, ఇండోర్ బిజెపి ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏకలవ్య సింగ్ గౌర్ హిందూ రక్షక్ సంఘటన్ సంస్థకు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నేరం కింద తాప్సీ పన్ను పై ఎఫ్ఐఆర్ నమోదయింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు