Shaakuntalam : సమంత చేతిలో జప మాల ఎందుకు ?

సమంత రూత్ ప్రభు.. సౌత్ ఇండస్ట్రీలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో యూత్ ను నిజంగానే మాయ చేసింది సమంత. వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతోంది.

కొని నెలల క్రితం ఒక అరుదైన వ్యాధితో తాను బాధ పడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. వ్యాధి గురంచి వివరించిన సామ్, దాని పేరు మయోసైటిస్‌ అని.. ఇది చాలా అరుదుగా మనుషుల్లో కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాధికి సమంత విదేశాల్లో కూడా చికత్స తీసుకుంది. కొన్ని రోజులు బయట ప్రపంచానికి దూరంగా ఉండి.. తాను రెగ్యూలర్ గా వెళ్లే ఈషా ఫౌండేషన్ చాలా రోజులు రెస్ట్ తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

నిజానికి సామ్ ఈష ఫౌండేషన్ కు ఎక్కువ సార్లు వెళ్లుంది. మయోసైటీస్ వ్యాధి లేని సమయంలో కూడా ఈషలో కనిపించేంది. ఇదిలా ఉండగా, తాజాగా సమంత ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచ్ కోసం సామ్ మీడియా ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఎమోషనల్ గా సాగింది.

- Advertisement -

అయితే ఈవెంట్ లో సామ్ చేతిలో జప మాలపై అందరి కంట పడింది. కాగా ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో సామ్ కనిపించినప్పుడు.. అక్కడ కూడా సామ్ చేతిలో ఈ జప మాల కనిపించింది. దీంతో ఈ జప మాల వెనక ఉన్న రహస్యం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. కాగా నేటి ప్రెస్ మీట్ లో జప మాల వెనక ఉన్న రహస్యమేంటి అని సినిమా విలేకర్లు ప్రశ్నించారు. దానికి సామ్.. ఇది లక్ష జపం చేయడం కోసం అని సమాధానం ఇచ్చింది. అలాగే ఓం హైం.. క్రీం.. అలాంటి కొన్నింటితో తాను లక్ష జపం చేస్తానని వివరించింది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు