Trivikram Srinivas: ఈ ప్లాన్ ఏదో బాగుంది గురూజీ

గురూజీ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం సినిమాతో మాటల రచయిత తెలుగు తెరకు పరిచయమైన త్రివిక్రమ్. అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో ఒక చెరగని ముద్రను వేసారు. తెలుగు సినిమా సంబాషణలను కొత్త పుంతలు తొక్కించాడు. రచయితగా కెరియర్ పీక్ లో ఉన్న టైం లో “నువ్వే నువ్వే” సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక కూడా వెంకటేష్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ సినిమాలకు రచయితగా మళ్ళీ పెన్ పట్టుకున్నాడు. త్రివిక్రమ్ రాసిన తీన్ మార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఆ సినిమాకి ఇప్పటికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తరువాత ఎక్కువ సినిమాలు స్టార్ హీరోస్ తోనే చేసాడు. పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు దర్శకుడుగా చేసిన త్రివిక్రమ్. ఇప్పడు పవన్ కోసం రచయితగా మారుతున్నాడు.

కేవలం రచయితగా మాత్రమే ఉన్నారు అనుకుంటే పొరపాటే, దీని వెనుక గురూజీ అద్భుతమైన ప్లాన్ వేసి దానిని ఒక పథకం ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కెరియర్ ఇప్పుడు ఫుల్ బిజీగా మారింది. ఒకప్పుడు రెండేళ్లకు ఒక సినిమా చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకే ఏడాది రెండు మూడు సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే త్రివిక్రమ్ ఇన్వాల్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని ముందు జరిగిపోతున్నాయి.

- Advertisement -

పవన్ కి తక్కువ రోజులు షూటింగ్ చేసినట్టు ఉంటుంది, దానితో పాటు సినిమా పూర్తయిపోతుంది. పార్టీ కి కావాల్సిన ఫండ్ కూడా రెమ్యునరేషన్ రూపంలో ముడుతుంది. త్రివిక్రమ్ రాసిన భీమ్లా నాయక్ తరువాత, ఇప్పుడు బ్రో జులై లో విడుదలకు సిద్దమవుతుంది. సంవత్సరాలు తరబడి ఒక సినిమా చేయడం కంటే ఇలా బెటర్ అని త్రివిక్రమ్ వేసిన ప్లాన్ బెస్టే కదా మరి.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు