Usthad Bhagat Singh: రెగ్యులర్ షూట్ అప్పుడే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా వినోదయ సిత్తం రీమేక్ షూట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ లో బిజీగా గడపనున్నారు. అనంతరం పవర్ స్టార్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి తేరీ మూవీకి అధికారిక రీమేక్ గా రూపొందిపోతుంది.

ఈ మూవీని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కాబోతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 28 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ మూవీ తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుండడంతో ఈ చిత్రంపై సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ అయిందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీల ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ రానుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు