Pawan Kalyan: ఫుల్ ఫోకస్ సినిమాలపైనే..

గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 11న ఈ చిత్రం లాంచనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 11న ఉదయం 11:45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర నిర్మాతలు, పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన ప్రభంజనం కారణంగా ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలవల్ల ఆమె ఈ సినిమా నుంచి వైదొలినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలోనే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రానుంది.

తొలుత ఈ సినిమాకు భవదీయుడు భవత్ సింగ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత సినిమా పేరును ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. అందుకు గల కారణాలని మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త ఏంటంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అంటే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను అన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. OGని కూడా ఇటీవలే స్టార్ట్ చేశాడు. అలాగే తాజాగా ఈ రోజు వినోదయ సీతం తెలుగు రీమేక్ ఫస్ట్ షెడ్యూల్ ను ప్రారంభించాడు. వినోదయ సీతం పూర్తి అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ను సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో OG షూటింగ్ కూడా ఉండబోతుందని సమాచారం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు