Ugram: నాంది డైరెక్టర్ తో నాగ చైతన్య

నాంది సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ దగ్గర గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విజయ్ అల్లరి నరేష్ హీరోగా నాంది సినిమా చేసారు. అప్పటిదాకా వరుస ప్లాప్ లతో కెరీర్ అంత అగమ్యగోచరంగా ఉన్న అల్లరి నరేష్ కి నాంది సినిమా మంచి విజయాన్ని అందించి నరేష్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ నాంది పలికింది.

అయితే నాంది సినిమా తర్వాత విజయ్ కనకమేడల నాగ చైతన్యతో ఒక సినిమా చేయాల్సిఉండే, కానీ డేట్స్ కారణంగా ఆ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా చేస్తున్న సమయంలో విజయ్ కనకమేడల నాగ చైతన్యకి కథ వినిపించారు. కథ నచ్చిన నాగ చైతన్య కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచించాడు. ఆ మార్పులు చేయడంలో ఆలస్యం కావడంతో నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమాకి ఒకే చెప్పారు. దాంతో విజయ్ నాగ చైతన్యల సినిమా వెనక్కి వెళ్ళింది.

నాగ చైతన్య సినిమా వెనక్కి వెళ్లడంతో విజయ్ అల్లరి నరేష్ కి ఉగ్రం సినిమా కథని వినిపించారు. నరేష్ కి కథ నచ్చడంతో ఉగ్రం సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా ఈ నెల5న విడుదలకి సిద్దమవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ,సాంగ్స్ అందరిని ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా పలు ఇంటర్వ్యూ లలో  పాల్గొన్న ఆయన, తన తరువాత సినిమా నాగ చైతన్య తో ఉంటుందని. కస్టడీ సినిమా రిలీజ్ తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుంది అని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఉగ్రం సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఎవరు ఊహించని విధంగా సినిమా ఉండబోతుందని ఇంత వారికి ఎవరు చెప్పని యూనిక్ పాయింట్ ని తమ సినిమాలో చెప్పబోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు