Box Office: విరూపాక్ష టోటల్ బిజినెస్.. హీరో కెరీర్ బెస్ట్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా విరూపాక్ష. నూతన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. విరూపాక్ష చిత్రాన్ని ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ముందుగా పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ చేద్దామనుకున్నా, ప్రస్తుతం ఉన్న పోటీ, ఇంకా థియేటర్ల సమస్య వల్ల తెలుగులోనే రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డిటైల్స్ వచ్చాయి. విరూపాక్ష సినిమా తెలుగు రాష్టాల్లో నైజాం 7కోట్లు, సీడెడ్ 3.7 కోట్లు, ఆంధ్ర 8.5 కోట్లు కలిపి మొత్తం 19.20 కోట్లు జరగగా కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 1.50 కోట్లు, ఓవర్సీస్ లో 1.50 కోట్లు జరిగింది. వరల్డ్ వైడ్ గా టోటల్ 22.20 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 23 కోట్లు వసూలు చేయాలి. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరుపుకోవడం విశేషం. అంతకు ముందు సాయి సినిమాల్లో ప్రతి రోజు పండగే సినిమా కి 17.80 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు విరూపాక్ష తో అది బ్రేక్ అయింది.

విరూపాక్ష సినిమా కు ఉన్న హైప్ దృష్ట్యా మంచి టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. అది గాక దసరా సినిమా తర్వాత మూడు వారాలుగా వచ్చిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. కాబట్టి విరూపాక్ష కి అది ప్లస్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు