Chiranjeevi: నాపై కోడిగుడ్లు విసిరారు

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాతే తెలుగు సినిమాలలో ఫైట్ లకు, పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగతా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్ లో విడుదలైంది. ఫస్ట్ డే మిగతా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇది ఇలా ఉండగా, తెలుగులో ఓటీటిలో మరో టాక్ షో రాబోతోంది. నటి స్మిత హోస్ట్ గా నిజాం విత్ స్మిత అంటూ సోనీ లివ్ లో ఫిబ్రవరి 10వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ షోలో మొదటి ఎపిసోడ్ కష్టేఫలీడ్ మొబిలిటీ అనే పేరుతో మెగాస్టార్ చిరంజీవితో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో చిరంజీవి ఫస్ట్ క్రష్ మరియు స్టార్ డమ్ వచ్చే క్రమంలో జరిగిన అవమానాల గురించే స్మిత అడిగారు. దానికి చిరంజీవి బదులు ఇస్తూ, తాను కెరీర్ లో చాలా కష్టాలు పడ్డానని, ఒకానొక సమయంలో నాపై గతంలో కోడిగుడ్లు కూడా విసిరారంటూ చిరంజీవి తెలిపారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు