Logo

  • logo
  • logo
  • Movies
  • Movie Reviews
  • Gossips
  • Gallery
  • Web Stories
  • Memes
  • OTT
  • Interviews
  • Filmi Booking
English
  • Facebook
  • Instagram
  • Twitter
  • Telegram
Trending News View
  • Home
  • Movies
  • Movie Reviews
  • Gossips
  • Gallery
  • Web Stories
  • Memes
  • OTT
  • Interviews
  • Filmi Booking
follow us:
  • Facebook
  • Instagram
  • Twitter
  • Telegram
  1. Movie Review
  2. SIR Movie Review

SIR Movie Review

SIR

SIR

critic's rating
3
About the movie

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఏడాదికి 4 నుంచి 5 సినిమాలు చేసే ధనుష్, ఎక్కువగా ఢిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీలనే ఎంచుకుంటారు. ఈ క్రమంలో వచ్చిన మూవీ సార్ (తమిళంలో వాతి). “విద్య – వ్యాపారం” అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫోర్చున్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్ధాం. 

కథ :

బాల గంగాధర్ తిలక్ (ధనుష్) ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. బాలు.. శ్రీనివాస్ త్రిపాఠి (సముద్ర ఖని) కి చెందిన ప్రయివేట్ కాలేజ్ లో లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అధిక ఫీజులు తీసుకుని విద్యాసంస్థలను నడిపిస్తున్న త్రిపాఠి.. కార్పొరేట్ కాలేజీలకు అధ్యక్షుడిగా ఉంటాడు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల మనుగడ కోసం ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చూస్తోంది. దీంతో ప్రభుత్వ కాలేజీలను తాను దత్తత తీసుకుంటాని చెబుతారు. అందులో భాగంగా, థర్డ్ గ్రేడ్ లెక్చరర్స్‌ను ఆ కాలేజీలకు పంపించి, ప్రభుత్వ కాలేజీలను పూర్తిగా మూసివేయాలని కుట్రపన్నుతాడు. కానీ, అత్యంత తెలివైన బాలు.. సిరిపురం గ్రామానికి వెళ్తాడు. మరి అక్కడ విద్యార్థుల కోసం బాలు ఏం చేశాడు ? బాలు ప్రయత్నానికి త్రిపాఠి ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేశాడు ? ఈ క్రమంలో బాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? ఆ గ్రామం విద్యార్థులు ఏం సాధించారు ? అనేది తెలియాలంటే సార్ సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ :

ఒక మనిషి కావాల్సిన కనీస అవసరాలు.. కూడు, గుడ్డ, నీడ. ఇది చాలా ఏళ్ల క్రితం నాటి మాట. కానీ, ప్రస్తుత కాలంలో వీటితో పాటు ఒక మనిషి మనుగడకు ముఖ్యంగా కావాల్సిది విద్య. ఒక దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది అంటే.. అక్కడ విద్య ఎక్కువ శాతం ఉంది అని అర్థం. ఒక దేశం అప్పుల్లో కూరుకుపోయి, అక్కడి ప్రజలు ఆకలి చావులతో అలమటిస్తున్నారు అంటే.. అక్కడ విద్య లేదని అర్థం. 

అంటే విద్యకు దేశ ప్రగతిని మార్చేసే శక్తి ఉంటుందని దీనితో అర్థమవుతుంది. అలాంటి విద్య ప్రస్తుతం అంగడి సరుకు అవుతుంది. సాధారణంగా విద్యార్థులు చదువుకోవాలి. కానీ, నేటి విద్యార్ధులు చదువును కొంటున్నారు. డబ్బు తక్కువ ఉన్నవారు.. తక్కువ డబ్బుతో.. కాస్త ఎక్కువ డబ్బు ఉన్నవారు ఎక్కువ డబ్బుతో విద్యను కొంటున్నారు అని ప్రస్తుత రోజులను చూస్తే చెప్పొచ్చు. ఇది 90వ దశకం నుంచే స్టార్ట్ అయింది. 

అందుకే కాబోలు దర్శకుడు వెంకీ అట్లూరీ సార్ సినిమా స్టోరీ 90వ దశకం నేపథ్యంలో తీసుకున్నాడు. 90వ దశకం నుంచే దేశంలో ప్రయివేట్ కాలేజీలు ఉద్భవించాయి. దీంతో ప్రభుత్వ కాలేజీలు మూతపడ్డాయి. సినిమా ప్రారంభంలో అదే చూపిస్తూ.. ప్రయివేట్ కాలేజీల మోసాలు తెలుపుతూ.. క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ క్లాసీగా సినిమా సాగింది. ఫాస్టాఫ్ లో చిన్నపాటి లవ్ స్టోరీ, హైపర్ ఆదితో కొంత కామెడీని పండించి ప్రేక్షకులకు బోరు ఫీలింగ్ రాకుండా దర్శకుడు చూసుకున్నాడు. సినిమాను ఇంట్రెస్టింగ్ గా రన్ చేస్తూనే, ఎమోషనల్ సీన్స్ ను పెట్టి మెప్పించాడు.

సినిమా డైరెక్టర్ అనుకున్న విధంగానే సాగింది. ఎక్కడా కూడా కమర్షియల్ హంగులకు చోటు ఇవ్వకుండా.. తాను చెప్పాలి అనుకున్న అంశాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. సెకండాఫ్ మొత్తం ఆలోచింపజేశాలా ఉంటుంది. సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినది.. వెంకీ అట్లూరి డైలాగ్స్. ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతాయి. స్వతహాగా మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కు అభిమాని కావటం వల్లేమో.. సినిమాలో డైలాగ్స్ ను కూడా ఇంపాక్ట్ ఫుల్ గా రాయగలిగాడు దర్శకుడు. అయితే మూవీలో కొన్ని సినిమాటిక్ అంశాలు ఉన్నాయి. అయితే అవి.. ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ ను దెబ్బతీసేలా మాత్రం లేవని చెప్పొచ్చు. ప్రిడెక్టబుల్ స్టోరీ. అలాగే పెద్దగా మలుపులు కూడా ఈ సినిమాలో లేవు. అయినా, ఎక్కడా బోర్ ఫీల్ అయితే రాదు.

ఫాస్టాఫ్ కామెడీ, లవ్ స్టోరీ, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మెప్పించేలా ముగుస్తోంది. సెకండాఫ్ స్టార్టింగ్ కూడా బాగుంటుంది. కానీ, సెకండాఫ్ లో ధనుష్ ఊరి నుంచి వెళ్లే సీన్ దగ్గర కాస్త ల్యాగ్ అయినట్టు ఫీల్ వస్తొంది. కానీ, తర్వాత మళ్లీ స్టోరీ ట్రాక్ లోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఈజ్ గా సాగుతుంది. 

ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ టూ.. గుడ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్.. విద్యార్థులను ఇన్స్పైర్ చేసే సన్నివేశాలు.. అలాగే లవ్, కామెడీ సీన్స్ లలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ధనుష్ ను మినహా వేరే హీరోను ఊహించుకోవడం కష్టమే అన్నట్టు నటించాడు. ఇక తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్. సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగా పండటానికి ఒక కారణం జీవీ ప్రకాశ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సంయుక్త మీనన్ నటన బాగుంది. సముద్ర ఖని.. మరోసారి తన ఫర్మామెన్స్ తో మెప్పించాడు. హైపర్ ఆది ఉన్నది తక్కువ సమయమే అయినా, తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను నవ్విస్తాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలకు కూడా మంచి మార్కులే వేయొచ్చు. 

ప్లస్ పాయింట్స్ :

  • ధనుష్ నటన
  • విద్య కాన్సెప్ట్
  • కథ, కథనం
  • బ్యాగ్రౌండ్ మ్యూజిక్
  • ఇన్స్పైర్ చేసే డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

  • ట్విస్టులు లేకపోవడం
  • కొన్ని ల్యాగ్ సీన్స్

మొత్తంగా..

ధనుష్ సార్ ఇంట్రెస్టింగ్.. ఎమోషనల్.. సందేశాత్మక పాఠం.. 

 

videos

Nani’s Dasara movie Trailer
Play Now
Sai Dharam Tej’s Virupaksha Telugu Teaser
Play Now
Amigos Trailer : Kalyan Ram
Play Now
Writer Padmabhushan Theatrical Trailer
Play Now
Banjara Lyrical Song from Dhanush Sir Movie
Play Now
SIR : వీరలెవెల్లో క్లాస్ పీకిన “సార్” !
Play Now

photos

- No Content -

cast

Dhanush as Bal Gangadhar Tilak
Samyukta Menon as Meenakshi
Samuthirakani as Srinivas Tirupati
Sai Kumar as Actor

crew

Venky Atluri
Venky Atluri as Director
Suryadevara Naga Vamsi
Suryadevara Naga Vamsi as Producer
Sai Soujanya
Sai Soujanya as Producer
GV Prakash Kumar
GV Prakash Kumar as Music
SIR Movie Review

SIR

3
Amigos Movie Review

Amigos

2.5
Waltair Veerayya Review

Waltair Veerayya

3.25
Veera Simha Reddy Review

Veera Simha Reddy

2.25
Tegimpu Review

Tegimpu

2.5
Laththi

Laththi

2
Panchatantram

Panchathantram

2.75
HIT 2

HIT 2

3.25
Itlu Maredumilli Prajaneekam

Itlu Maredumilli Prajaneekam

3
Masooda

Masooda

3.25
×
logo
  • About Us
  • Privacy & Cookies Notice
  • Complaint Redressal
  • Copyright © 2022 Filmify. All rights reserved.
follow us:
  • Facebook
  • Instagram
  • Twitter
  • Telegram